Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 12 OTSA

Side by side with the Father's Heart Bible™

స్తుతి పాటలు

1ఆ రోజున మీరు ఇలా అంటారు:“యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను.మీరు నాపై కోప్పడినా కూడామీ కోపం చల్లారిందిమీరు నన్ను ఆదరించారు.

2నిజంగా దేవుడే నా రక్షణ;నేను భయపడను ఆయనను నమ్ముతాను.యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ;ఆయనే నా రక్షణ అయ్యారు.”

3మీరు రక్షణ బావులలో నుండిఆనందంతో నీళ్లు చేదుతారు.

4ఆ రోజున మీరు ఇలా అంటారు:“యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి,ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.

5యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు;లోకమంతటికి ఇది తెలియాలి.

6సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి,ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]