యాత్రకీర్తన. 1యెహోవా పట్ల భయం కలిగి,ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు. 2మీరు మీ కష్టార్జితాన్ని తింటారు;ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది. 3మీ ఇంట్లో మీ భార్యఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది;మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలుఒలీవ మొక్కల్లా ఉంటారు. 4యెహోవా పట్ల భయం కలవారుఈ విధంగా ఆశీర్వదించబడతారు. 5సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు;మీ జీవితకాలమంతాయెరూషలేము అభివృద్ధిని చూస్తారు. 6మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారుఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.