Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 129 OTSA

Side by side with the Father's Heart Bible™

యాత్రకీర్తన.

1“నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు”అని ఇశ్రాయేలు అనాలి;

2“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు,కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.

3దున్నువారు దున్నినట్లునా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.

4అయితే యెహోవా నీతిమంతుడు;దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”

5సీయోనును ద్వేషించే వారందరుసిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.

6వారు ఎదగక ముందే ఎండిపోయినఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.

7దానితో కోత కోసేవారు తమ చేతిని గానిపనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.

8“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక;యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము”అని బాటసారులు అనకుందురు గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]