సొలొమోను యాత్రకీర్తన. 1యెహోవా ఇల్లు కడితేనే తప్పదానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే.యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతేదాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే. 2మీరు ప్రొద్దున్నే లేచిఆలస్యంగా పడుకొంటూ,కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే.ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు. 3పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం,గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. 4యవ్వనకాలంలో పుట్టిన పిల్లలువీరుని చేతిలో బాణాలవంటివారు. 5వారితో తన అంబులపొదినినింపుకున్నవాడు ధన్యుడు.గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడువారు అవమానం పొందరు.