Side by side with the Father's Heart Bible™ యాత్రకీర్తన.
1యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు,మనం కలలుగన్న వారిలా ఉన్నాము.
2మన నోరు నవ్వుతో నింపబడింది,మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి.“యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అనిఇతర దేశాలు చెప్పుకున్నాయి.
3యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు,మనం ఆనందభరితులం అయ్యాము.
4దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా,యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.
5కన్నీటితో విత్తేవారుసంతోషగానాలతో పంట కోస్తారు.
6విత్తనాలను పట్టుకుని,ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు,సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.