Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 25 OTSA

Side by side with the Father's Heart Bible™

బిల్దదు

1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:

2“అధికారం భీకరత్వం దేవునివే;ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.

3ఆయన సైన్యాలు లెక్కించబడగలవా?ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?

4అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు?అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?

5ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు;నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.

6పురుగువంటి మనుష్యుడుక్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]