Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 23 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు కీర్తన

1యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.

2పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు.ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.

3ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు.ఆయన తన నామం కోసంనీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.

4మృత్యు నీడలా ఉన్న లోయలోనేను నడిచినా,ఏ కీడుకు భయపడను,ఎందుకంటే మీరు నాతో ఉన్నారు;మీ దండం మీ చేతికర్రనన్ను ఆదరిస్తాయి.

5నా శత్రువులు ఉన్న చోటనేమీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు.నూనెతో నా తల అభిషేకించారు;నా పాత్ర నిండి పొర్లుతుంది.

6నిశ్చయంగా నా జీవితకాలమంతామీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.నేను నిరంతరంయెహోవా మందిరంలో నివసిస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]