Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 15 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు కీర్తన.

1యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు?మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

2నిందారహితంగా నడుచుకొనేవారు,నీతిని జరిగించేవారు,తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;

3తమ నాలుకతో అపవాదులు వేయనివారు,పొరుగువారికి కీడు చేయనివారు,స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

4నీచులను అసహ్యించుకునియెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు;తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు,తమ మనస్సు మార్చుకొననివారు;

5వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు;నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు.వీటిని చేసేవారుఎన్నటికి కదిలించబడరు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]