Side by side with the Father's Heart Bible™ సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
1“దేవుడు లేడు”అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు.వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి;మంచి చేసేవారు ఒక్కరు లేరు.
2వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారాఅని యెహోవా పరలోకం నుండిమనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.
3అందరు దారి తప్పి చెడిపోయారు;మంచి చేసేవారు ఎవరూ లేరు.ఒక్కరు కూడా లేరు.
4కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.
5వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు,ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.
6కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు,కాని యెహోవా వారి ఆశ్రయము.
7సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది;యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!