Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 15 OTSA

Side by side with the Father's Heart Bible™

మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం

1మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం:ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణంపాడై నశిస్తుంది!ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణంపాడై నశిస్తుంది!

2దీబోను ఏడ్వడానికి గుడికితన క్షేత్రాలకు వెళ్తుంది;నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది.ప్రతి తల క్షౌరం చేయబడిందిప్రతివాని గడ్డం గొరిగించబడింది.

3వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు;తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లోవారందరు రోదిస్తారు,ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.

4హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు,యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది.కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు,వారి హృదయాలు క్రుంగిపోతాయి.

5మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది;వారిలో పారిపోయినవారు సోయరు వరకు,ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు.వారు లూహీతు ఎక్కుతున్నప్పుడుఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు;హొరొనయీము వెళ్లే దారిలోతమ నాశనం గురించి విలపిస్తారు.

6నిమ్రీము నీళ్లు ఎండిపోయాయిగడ్డి ఎండిపోయింది;వృక్ష సంపద ఉండదుపచ్చదనం ఎక్కడా మిగల్లేదు.

7కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తినినిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.

8వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి;వారి రోదన ఎగ్లయీము వరకువారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.

9దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయికాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను.మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికిఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]