1యెహోవా యాకోబుపై జాలి చూపుతారు;ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొనివారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు.విదేశీయులు వారిని కలుసుకుంటారుయాకోబు వారసులతో ఏకమై ఉంటారు.
2ప్రజలు వారిని తీసుకువచ్చివారి సొంత దేశంలో వారిని చేర్చుతారు.ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకునియెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు.వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకునితమను బాధించిన వారిని పాలిస్తారు.
3నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున, 4నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు:బాధ పెట్టినవాడు ఎలా నశించాడు!రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!
5దుర్మార్గుల దుడ్డుకర్రనుపాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.
6వారు కోపంతో ఎడతెగని దెబ్బలతోప్రజలను క్రూరంగా కొట్టారు,కోపంతో ప్రజలను పరిపాలించికనికరం లేకుండా వారిని అణచివేశారు.
7భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది;వారు పాడడం మొదలుపెట్టారు.
8సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లునీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి,“నీవు పడుకుంటున్నప్పటి నుండిమమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.”
9నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికిక్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది;అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగాభూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది;దేశాలకు రాజులుగా ఉన్నవారందరినితమ సింహాసనాలు నుండి లేపుతుంది.
10వారందరు నిన్ను చూసినీతో ఇలా అంటారు,“నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు;నీవు కూడా మాలా అయ్యావు.”
11నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతాక్రింద సమాధిలో పడవేయబడింది;నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయిక్రిములు నిన్ను కప్పివేస్తాయి.
12తేజోనక్షత్రమా, వేకువచుక్కా,నీవెలా ఆకాశం నుండి పడ్డావు?దేశాలను పడగొట్టిన నీవుభూమి మీద ఎలా పడవేయబడ్డావు?
13నీవు నీ హృదయంలో,“నేను ఆకాశాలను ఎక్కుతాను;దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగానా సింహాసనాన్ని హెచ్చిస్తాను;ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద,సాఫోన్ పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.
14మేఘ మండలం మీదికి ఎక్కుతాను.నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు.
15కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలోలోతైన గోతిలో త్రోయబడ్డావు.
16నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూనీ విధి గురించి ఇలా అనుకుంటారు:“భూమిని కంపింపజేసిరాజ్యాలను వణికించింది ఇతడేనా?
17లోకాన్ని అడవిగా చేసిదాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా?తాను బంధించిన వారిని తమ ఇళ్ళకు పోనివ్వనివాడు ఇతడేనా?”
18దేశాల రాజులందరూ ఘనత వహించినవారైతమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు.
19అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలానీ సమాధి నుండి పారవేయబడ్డావు.నీవు చంపబడినవారితోకత్తితో పొడవబడిన వారితోపాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు.కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.
20నీవు నీ దేశాన్ని పాడుచేసినీ ప్రజలను చంపేశావుకాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు.దుర్మార్గుని సంతానంఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.
21వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకునితమ పట్టణాలతో భూమిని నింపకుండాతమ పూర్వికుల పాపాన్ని బట్టిఅతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి.
22“నేను వారి మీదికి లేస్తాను” అనిసైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు,“బబులోను పేరును దానిలో మిగిలినవారిని,సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను”అని యెహోవా తెలియజేస్తున్నారు.
23“నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తానునీటిమడుగులుగా చేస్తాను;నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అనిసైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
24సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే:“నేను ఉద్దేశించినట్లే అది తప్పక ఉంటుంది,నేను ఆలోచించినట్లే అది జరుగుతుంది.
25నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను;నా పర్వతాలమీద అతన్ని నలగదొక్కుతాను.అతని కాడి నా ప్రజల మీద నుండి తీసివేయబడుతుంది,అతని భారం వారి భుజాలపై నుండి తొలగించబడుతుంది.”
26లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే;ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.
27సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు?ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?
ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం
28రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం:
29ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్రవిరిగిపోయిందని మీరందరు సంతోషించకండి;సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది,దాని సంతానం ఎగిరే విషసర్పము.
30అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు,అవసరతలో ఉన్నవారు క్షేమంగా పడుకుంటారు.కాని కరువుతో మీ మూలాన్ని నాశనం చేస్తాను;అది మీలో మిగిలి ఉన్నవారిని చంపేస్తుంది.
31గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి!ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి!ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది.పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.
32ఆ దేశ దూతలకుఇవ్వవలసిన జవాబు ఏది?“యెహోవా సీయోనును స్థాపించారు,ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.”