Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 16 OTSA

Side by side with the Father's Heart Bible™

1ఎడారి వైపు ఉన్న సెల నుండిదేశాన్ని పాలించేవానికికప్పంగా గొర్రెపిల్లలనుసీయోను కుమార్తె పర్వతానికి పంపండి.

2గూటినుండి చెదరగొట్టబడిఇటు అటు ఎగిరే పక్షుల్లాఅర్నోను రేవుల దగ్గరమోయాబు స్త్రీలు ఉంటారు.

3మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో,నిర్ణయం తీసుకో.చీకటి కమ్మినట్టుగా మిట్టమధ్యాహ్నంనీ నీడ మామీద ఉండనివ్వు.పారిపోయినవారిని దాచి పెట్టు,శరణార్థులకు ద్రోహం చేయకు.

4పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు;నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.”హాని చేసేవారు అంతం అవుతారు,విధ్వంసం ఆగిపోతుంది;అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు.

5మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది;దావీదు కుటుంబం నుండిసత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చునిన్యాయంగా తీర్పు తీర్చుతూనీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.

6మోయాబు గర్వం గురించి మేము విన్నాముదాని అహంకారం చాలా ఎక్కువదాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం;అయితే దాని ప్రగల్భాలు వట్టివే.

7కాబట్టి మోయాబీయులు రోదిస్తారు,వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు.కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్లవిలపించి దుఃఖిస్తారు.

8హెష్బోను పొలాలు,షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి.యాజెరు వరకు వ్యాపించినఅరణ్యం వరకు ప్రాకినశ్రేష్ఠమైన ద్రాక్షతీగెలనుదేశాల పాలకులు త్రొక్కివేశారు.వాటి తీగెలు విశాలంగా వ్యాపించిసముద్రాన్ని దాటాయి.

9అందువల్ల యాజెరు ఏడ్చినట్లునేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను.హెష్బోనూ ఎల్యాలెహు,నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను.నీ పండిన ఫలాల కోసంనీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.

10ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి;ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు;గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు.ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను.

11నా హృదయం వీణలా మోయాబు గురించి,నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది.

12మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడుఅది కేవలం ఆయాసపడుతుంది;ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడుదానికి ఏమి దొరకదు.

13యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది. 14అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]