Side by side with the Father's Heart Bible™ సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
1నీతిమంతుడవైన నా దేవా,నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి.నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి;నాపై దయచూపి నా ప్రార్థన వినండి.
2ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు?మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా
3యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి;నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.
4వణకండి, పాపం చేయకండి.మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూప్రశాంతంగా ఉండండి. సెలా
5నీతియుక్తమైన బలులను అర్పించియెహోవాపై నమ్మకముంచండి.
6యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?”అని అనేకులు అడుగుతున్నారుమీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
7ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నాఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
8నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను.ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమేనన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.