Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 2 OTSA

Show OTSA only
Verse × ×
1 Why do the nations rage, and the peoples plot in vain? దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
2 The kings of the earth take their stand, and the rulers conspire together against our Father and against his Anointed One. యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,
3 "Let us tear off the chains they have put on us," they say, "and throw their ropes away from us." “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
4 Our Father, enthroned in heaven, laughs; the Sovereign Father scoffs at them. ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.
5 Then he will speak to them in his anger and terrify them in his fury: ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,
6 "I myself have installed my King on Zion, my holy mountain." “నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”
7 I will proclaim the decree of our Father: he said to me, "You are my Son; today I have become your Father. నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.
8 "Ask me, and I will make the nations your inheritance, and the ends of the earth your possession. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
9 You will break them with a rod of iron; you will shatter them like a potter's jar." ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”
10 Now then, you kings, be wise; be warned, you rulers of the earth. కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
11 Serve our Father with reverence, and rejoice with trembling. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
12 Kiss the Son, or he will be angry and you will perish along the way, for his wrath can flare up in a moment. Blessed are all who take refuge in him. ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]