Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 2 OTSA

Side by side with the Father's Heart Bible™

1దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి?ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?

2యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగాభూరాజులు లేచిపాలకులందరు ఒకటిగా చేరి,

3“మనం వారి గొలుసులను తెంపుదాంవారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.

4ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు;ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.

5ఆయన కోపంతో వారిని గద్దించితన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,

6“నా పవిత్ర పర్వతమైన సీయోనునునా రాజు ఏలుతున్నారు.”

7నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను:ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు;ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.

8నన్ను అడిగితే,నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా,భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.

9ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు;పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”

10కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి;భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.

11యెహోవాను భయంతో సేవించండివణుకుతూ ఆనందించండి.

12ఆయన కుమారున్ని ముద్దాడండి,లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది.మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది,ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది.ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]