Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 20 OTSA

Side by side with the Father's Heart Bible™

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

1కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక;యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.

2తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి,సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.

3మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలిమీ దహనబలులను అంగీకరించాలి. సెలా

4ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి,మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి.

5యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి,మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి.యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.

6యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారనిఇప్పుడు నాకు తెలిసింది.రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతోఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.

7కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు,కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.

8వారు పూర్తిగా పతనం చేయబడ్డారు,కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము.

9యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి!మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]