Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 19 OTSA

Side by side with the Father's Heart Bible™

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

1ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి;అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.

2పగటికి పగలు బోధ చేస్తుంది;రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.

3వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు;వాటి స్వరం వినబడదు.

4అయినా వాటి స్వరం భూమి అంతటికి,వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి.దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.

5సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా,తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.

6ఆకాశంలో ఒక చివర ఉదయించిమరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు.దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

7యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది,అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది.యెహోవా కట్టడలు నమ్మదగినవి,అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.

8యెహోవా కట్టడలు సరియైనవి,హృదయానికి ఆనందం కలిగిస్తాయి.యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి,కళ్లకు కాంతి కలిగిస్తాయి.

9యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది,నిరంతరం నిలుస్తుంది.యెహోవా శాసనాలు నమ్మదగినవి,అవన్నీ నీతియుక్తమైనవి.

10అవి బంగారం కంటే,మేలిమి బంగారం కంటే విలువైనవి;తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చేధారల కంటే మధురమైనవి.

11వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు;వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.

12తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు?నేను దాచిన తప్పులను క్షమించండి.

13కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి;అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి.అప్పుడు నేను యథార్థవంతుడనైఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.

14యెహోవా, నా కొండ, నా విమోచకా,నా నోటి మాటలు, నా హృదయ ధ్యానంమీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]