Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 137 OTSA

Side by side with the Father's Heart Bible™

1బబులోను నదుల దగ్గర మనం కూర్చునిసీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.

2దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకుమన సితారాలు తగిలించాము.

3మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు,మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు;“సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.

4పరాయి దేశంలో ఉండగాయెహోవా పాటలు మనం ఎలా పాడగలము?

5యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే,నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.

6నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే,యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేదిఅని నేను భావించకపోతేనా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.

7యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజునఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి.“దానిని నాశనం చేయండి.పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.

8త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ,నీవు మాకు చేసిన కీడును బట్టినీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు.

9మీ పసిపిల్లల్ని పట్టుకునివారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]