Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 138 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు కీర్తన.

1యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను;“దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను.

2మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ,మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి,మీ నామాన్ని స్తుతిస్తాను,ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలనుమీరు అధికంగా ఘనపరిచారు.

3నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు;మీరు నన్ను ధైర్యపరిచారు.

4యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడుమీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

5యెహోవా మహిమ గొప్పది కాబట్టి,వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక.

6యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు;ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు.

7నేను కష్టంలో చిక్కుకున్నామీరు నా జీవితాన్ని కాపాడండి.నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు;మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు.

8యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు;యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది,మీ చేతిపనిని వదిలిపెట్టకండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]