Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 18 OTSA

Show OTSA only
Verse × ×
1 Whoever isolates himself pursues his own desire; he lashes out against all sound wisdom. స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.
2 A fool takes no pleasure in understanding, but only in airing his own opinions. మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు.
3 When wickedness comes, contempt comes too, and with dishonor comes reproach. దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది.
4 The words of a person's mouth are deep waters; the fountain of wisdom is a flowing stream. నోటి మాటలు అగాధజలాలు, కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.
5 It is not good to show partiality to the wicked, denying justice to the righteous. తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.
6 A fool's lips bring strife, and his mouth invites a beating. మూర్ఖుల మాటలు తగాదాకు సిద్ధముగా ఉన్నది, వారి నోళ్ళు దెబ్బలు ఆహ్వానిస్తాయి.
7 A fool's mouth is his ruin, and his lips are a snare to his soul. మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి.
8 The words of a gossip are like choice morsels; they go down into the inmost being. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
9 Whoever is slack in his work is brother to one who destroys. పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు.
10 The name of our Father is a strong tower; the righteous runs into it and is safe. యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.
11 A rich man's wealth is his fortified city; in his imagination it is like a high wall. ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.
12 Before destruction the human heart is proud, but humility comes before honor. నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.
13 If one answers before he listens, it is his foolishness and his shame. సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
14 A person's spirit can sustain him through sickness, but a crushed spirit—who can bear it? నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది, కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు?
15 The discerning heart acquires knowledge, and the ear of the wise seeks it out. వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.
16 A person's gift opens the way for him and brings him before important people. ఒక బహుమతి మార్గం తెరుస్తుంది అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.
17 The first to state his case seems right, until another comes and examines him. ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు, వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది.
18 Casting the lot settles disputes and separates strong opponents. చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది.
19 An offended brother is harder to win than a fortified city, and disputes are like the bars of a fortress. కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము. వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి.
20 From the fruit of a person's mouth his stomach is satisfied; with the yield of his lips he is filled. నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు.
21 Death and life are in the power of the tongue, and those who love it will eat its fruit. చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.
22 He who finds a wife finds what is good and receives favor from our Father. భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
23 The poor person pleads for mercy, but the rich answers harshly. పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.
24 A man of many companions may come to ruin, but there is a friend who sticks closer than a brother. నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]