Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 17 OTSA

Show OTSA only
Verse × ×
1 Better a dry crust eaten in peace than a house full of feasting with strife. తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.
2 A prudent servant will rule over a disgraceful son and will share the inheritance among the brothers. వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.
3 The crucible is for silver and the furnace for gold, but our Father tests hearts. వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు.
4 An evildoer listens to wicked lips; a liar listens to a destructive tongue. చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును, అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు.
5 Whoever mocks the poor insults his Maker; whoever gloats over disaster will not go unpunished. పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.
6 Grandchildren are the crown of the aged, and the glory of children is their parents. పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.
7 Fine speech is not fitting for a fool—still less are lying lips for a noble. అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!
8 A bribe seems like a magic charm to the one who gives it; wherever he turns, he thinks he will succeed. లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.
9 Whoever covers an offense seeks love, but whoever keeps bringing it up separates close friends. ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.
10 A rebuke goes deeper into a person of understanding than one hundred blows into a fool. బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది.
11 A rebellious man seeks only evil, and a cruel messenger will be sent against him. ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట దయలేని దూత పంపబడును.
12 Better to meet a bear robbed of her cubs than a fool in his foolishness. మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.
13 If anyone returns evil for good, evil will never leave his house. మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.
14 Starting a quarrel is like breaching a dam, so drop the dispute before it bursts out. గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
15 Whoever justifies the wicked and whoever condemns the righteous—both alike are detestable to our Father. దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే.
16 Why should a fool have money in hand to buy wisdom, when he has no heart to learn? బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?
17 A friend loves at all times, and a brother is born for a time of trouble. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.
18 One who lacks sense shakes hands on a pledge and puts up security for his neighbor. బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.
19 Whoever loves wrongdoing loves strife; whoever builds his gate high invites destruction. తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.
20 A crooked heart finds no good, and a twisted tongue falls into trouble. అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.
21 Whoever fathers a fool brings grief on himself; the father of a godless fool has no joy. మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది, బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు.
22 A joyful heart is good medicine, but a crushed spirit dries up the bones. సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.
23 A wicked man takes a bribe in secret to pervert the ways of justice. న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.
24 A discerning person keeps wisdom in view, but the eyes of a fool wander to the ends of the earth. వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు, కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి.
25 A foolish son is a grief to his father and bitterness to the mother who bore him. బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు.
26 To punish the righteous is not good, nor to flog the noble for their integrity. అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.
27 Whoever holds back his words has knowledge, and one with a calm spirit is a person of understanding. తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు.
28 Even a fool who keeps silent is thought wise; when he closes his lips, he seems discerning. ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును, తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]