Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 16 OTSA

Show OTSA only
Verse × ×
1 The plans of the heart belong to man, but the answer of the tongue comes from our Father. హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.
2 All a man's ways are pure in his own eyes, but our Father weighs the motives. ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.
3 Commit your works to our Father, and your plans will be established. మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.
4 Our Father has made everything for its purpose, even the wicked for the day of trouble. యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు.
5 Everyone proud of heart is detestable to our Father; be assured, he will not go unpunished. గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు.
6 Loving devotion and faithfulness atone for sin, and the fear of our Father turns a person away from evil. ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.
7 When a man's ways please our Father, our Father makes even the man's enemies live at peace with him. ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.
8 Better a little with righteousness than great income with injustice. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.
9 The heart of man plans his way, but our Father establishes his steps. మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.
10 A divine verdict is on the lips of a king; his mouth does not betray justice. రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు.
11 Honest scales and balances belong to our Father; every weight and measure is his work. న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు.
12 It is detestable for kings to do wickedness, for a throne is established through righteousness. రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.
13 Righteous lips are the delight of kings, and they love the one who speaks what is right. రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.
14 A king's wrath is a messenger of death, but a wise man will appease it. రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు.
15 In the light of a king's face is life, and his favor is like a cloud bringing the spring rain. రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది.
16 How much better to get wisdom than gold! Getting understanding is worth more than silver. బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!
17 The highway of the upright turns away from evil; whoever guards his way protects his life. యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.
18 Pride goes before destruction, and a haughty spirit before a fall. నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
19 Better to be lowly in spirit among the poor than to share the plunder with the proud. గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
20 Whoever heeds the word will find good, and blessed is the one who trusts in our Father. ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
21 The wise of heart is called discerning, and pleasant speech increases persuasiveness. జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.
22 Understanding is a fountain of life to the one who has it, but fools are corrected by their own foolishness. వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
23 The heart of the wise makes his speech wise and adds persuasiveness to his lips. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది.
24 Pleasant words are a honeycomb, sweet to the soul and healing to the bones. దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
25 There is a way that seems right to a man, but its end is the way of death. ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
26 A worker's appetite works for him; his hunger drives him on. కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది.
27 A worthless man digs up evil, and on his lips is a scorching fire. పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.
28 A perverse man spreads strife, and a gossip separates close friends. మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.
29 A violent man entices his neighbor and leads him down a harmful path. హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.
30 Whoever winks his eyes plots perversity; whoever purses his lips is bent on evil. తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు.
31 Gray hair is a crown of glory; it is gained in the way of righteousness. నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.
32 Better a patient person than a mighty one, and one who rules his spirit than one who takes a city. యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.
33 The lot is cast into the lap, but its every decision is from our Father. చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]