Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 15 OTSA

Show OTSA only
Verse × ×
1 A gentle answer turns away wrath, but a harsh word stirs up anger. మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది.
2 The tongue of the wise commends knowledge, but the mouths of fools pour out foolishness. జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది.
3 The eyes of our Father are in every place, keeping watch on the evil and the good. యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి.
4 A gentle tongue is a tree of life, but a corrupt tongue crushes the spirit. నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
5 A fool despises his father's instruction, but whoever heeds correction is prudent. మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
6 In the house of the righteous there is much treasure, but the income of the wicked brings trouble. నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.
7 The lips of the wise spread knowledge, but not so the hearts of fools. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు.
8 The sacrifice of the wicked is detestable to our Father, but the prayer of the upright is his delight. భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.
9 The way of the wicked is detestable to our Father, but he loves the one who pursues righteousness. దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.
10 There is severe discipline for the one who leaves the path, and whoever hates correction will die. దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.
11 The grave and Destruction lie open before our Father; how much more the hearts of all people! మరణం, నాశనం యెహోవాకు కనబడతాయి, ఆయనకు మనుష్యుల హృదయాలు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా!
12 A scoffer does not love to be corrected; he will not go to the wise. ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు.
13 A glad heart makes a cheerful face, but a sorrowful heart crushes the spirit. హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
14 A discerning heart seeks knowledge, but the mouths of fools feed on foolishness. వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది, కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము.
15 All the days of the afflicted are hard, but a cheerful heart has a continual feast. బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే, కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే.
16 Better a little with the fear of our Father than great treasure and trouble with it. నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.
17 Better a meal of vegetables where there is love than a fattened ox with hatred. ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
18 A hot-tempered man stirs up strife, but one who is slow to anger calms a quarrel. ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది, దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది.
19 The way of the lazy is like a hedge of thorns, but the path of the upright is a level highway. సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.
20 A wise son makes a glad father, but a foolish man despises his mother. జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు, కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు.
21 Foolishness is joy to one who lacks sense, but a person of understanding walks a straight path. బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది, కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును.
22 Plans fail without counsel, but with many advisers they succeed. ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.
23 A person finds joy in giving an apt reply, and how good is a word at the right time! సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును, సమయానికి తగిన మాట ఎంతో మంచిది.
24 The path of life leads upward for the prudent, turning him away from the grave below. క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది.
25 Our Father tears down the house of the proud, but he protects the widow's boundary. గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును.
26 The thoughts of the wicked are detestable to our Father, but gracious words are pure. దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, దయగల మాటలు ఆయనకు పవిత్రము.
27 Whoever is greedy for unjust gain brings trouble on his own household, but the one who hates bribes will live. అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు.
28 The heart of the righteous weighs how to answer, but the mouth of the wicked pours out evil. నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది.
29 Our Father is far from the wicked, but he hears the prayer of the righteous. భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు.
30 The light of the eyes brings joy to the heart, and good news refreshes the bones. సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది.
31 The ear that listens to life-giving correction will dwell among the wise. జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు జ్ఞానుల సహవాసంలో ఉంటారు.
32 Whoever ignores instruction despises himself, but whoever listens to correction gains understanding. క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు, అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు.
33 The fear of our Father is the instruction of wisdom, and humility comes before honor. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]