Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 14 OTSA

Show OTSA only
Verse × ×
1 The wisest of women builds her house, but foolishness tears hers down with her own hands. జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది.
2 Whoever walks in uprightness fears our Father, but one whose ways are crooked despises him. యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు, ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు.
3 A fool's mouth is a rod for his own pride, but the lips of the wise protect them. మూర్ఖుల నోరు అరుస్తుంది, జ్ఞానం గలవారి పెదవులు వారిని కాపాడతాయి.
4 Where there are no oxen, the manger stays clean, but an abundant harvest comes through the strength of an ox. ఎద్దులు లేనిచోట, పశువుల దొడ్డి ఖాళీగా ఉంటుంది, కాని ఒక ఎద్దు బలం చేత విస్తారమైన పంట వస్తుంది.
5 A faithful witness does not lie, but a false witness breathes out lies. నమ్మకమైన సాక్షులు మోసం చేయరు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు కుమ్మరిస్తారు.
6 The scoffer seeks wisdom and finds none, but knowledge comes easily to the discerning. ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు, అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది.
7 Stay away from a fool, for you will find no knowledge on his lips. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము, జ్ఞానపు మాటలు వానియందు కనబడవు కదా.
8 The wisdom of the prudent is to discern their way, but the foolishness of fools is deceit. వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం, కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము.
9 Fools mock the guilt offering, but among the upright there is favor. పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.
10 The heart knows its own bitterness, and no stranger shares in its joy. హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది, దాని సంతోషంలో మరొకరు పాలివారు కాలేరు.
11 The house of the wicked will be destroyed, but the tent of the upright will flourish. దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును.
12 There is a way that seems right to a person, but its end is the way of death. ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
13 Even in laughter the heart may ache, and the end of joy may be grief. ఒకడు బయటకు నవ్వుతూ కనిపించినా, హృదయంలో బాధ ఉండవచ్చు చివరికి సంతోషం దుఃఖంగా మారుతుంది.
14 The backslider in heart will be filled with the fruit of his ways, and a good person with the fruit of his. విశ్వాసభ్రష్టులు తమ క్రియలకు తగిన మూల్యం పొందుతారు, మంచివారు వారి క్రియలకు తగిన బహుమానం పొందుతారు.
15 The simple believe anything, but the prudent give thought to their steps. బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు, కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు.
16 The wise fear and turn away from evil, but a fool is reckless and overconfident. జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
17 A quick-tempered person acts foolishly, and one who plots evil schemes is hated. తొందరగా కోప్పడేవారు మూర్ఖమైనవి చేస్తారు, దుష్ట పన్నాగాలు వేసేవారు ద్వేషించబడతారు.
18 The simple inherit foolishness, but the prudent are crowned with knowledge. జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి. వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు.
19 The evil bow down before the good, and the wicked at the gates of the righteous. చెడ్డవారు మంచివారి ఎదుటను, దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగుతారు.
20 The poor are shunned even by their neighbors, but the rich have many friends. పేదవారు తన పొరుగువారికి అసహ్యులు, ధనవంతులను ప్రేమించేవారు అనేకులు.
21 Whoever despises his neighbor sins, but blessed is the one who is kind to the poor. తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు, బీదలకు దయ చూపేవాడు ధన్యుడు.
22 Do not those who plot evil go astray? But covenant love and faithfulness belong to those who plan good. కీడు తలపెట్టేవారు తప్పిపోతారు? మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు.
23 In all hard work there is profit, but mere talk leads only to poverty. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టిమాటలు దరిద్రమునకు కారణము.
24 The crown of the wise is their wealth, but the foolishness of fools yields only foolishness. జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.
25 A truthful witness saves lives, but one who breathes out lies is treacherous. నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు, కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు.
26 In the fear of our Father is strong confidence, and his children will have a refuge. యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.
27 The fear of our Father is a fountain of life, turning a person away from the snares of death. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
28 A large population is a king's glory, but without people a prince is ruined. జనాభా ఎక్కువ ఉండడం చేత రాజులకు ఘనత వస్తుంది, జనులు తగ్గిపోవడం రాజులకు నాశనకరము.
29 Whoever is slow to anger has great understanding, but a hot temper exalts foolishness. ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు, త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.
30 A tranquil heart gives life to the body, but envy rots the bones. సమాధానం గల హృదయం శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు.
31 Whoever oppresses the poor reproaches our Father, their Maker, but whoever is kind to the needy honors him. పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు, బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు.
32 The wicked are brought down by their own evil, but the righteous find refuge even in death. అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు, చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది.
33 Wisdom rests in the heart of the discerning, but even among fools it makes itself known. వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది.
34 Righteousness exalts a nation, but sin is a disgrace to any people. నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.
35 A king's favor rests on a wise servant, but his wrath falls on one who acts shamefully. జ్ఞానంగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరమైన సేవకుడు రాజుకు కోపం రేపుతాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]