Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 13 OTSA

Show OTSA only
Verse × ×
1 A wise son heeds his father's instruction, but a scoffer does not listen to rebuke. జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.
2 From the fruit of his mouth a person enjoys good things, but the appetite of the treacherous is for violence. తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు, కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు.
3 Whoever guards his mouth protects his life, but one who opens his lips wide comes to ruin. తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.
4 The lazy person craves and gets nothing, but the appetite of the diligent is richly satisfied. సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.
5 The righteous hates falsehood, but the wicked brings shame and disgrace. నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.
6 Righteousness guards the one whose way is blameless, but wickedness overthrows the sinner. నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.
7 One person pretends to be rich, yet has nothing; another pretends to be poor, yet has great wealth. కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.
8 A person's wealth may ransom his life, but the poor hears no threat. ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.
9 The light of the righteous shines joyfully, but the lamp of the wicked will be snuffed out. నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును, కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.
10 Arrogance breeds nothing but strife, but wisdom is with those who seek advice. గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.
11 Wealth gained by fraud dwindles away, but whoever gathers little by little makes it grow. నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.
12 Hope deferred makes the heart sick, but desire fulfilled is a tree of life. వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది, అయితే కోరిక తీరుట జీవవృక్షము.
13 Whoever despises the word brings ruin on himself, but the one who reveres the commandment will be rewarded. బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు, కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు.
14 The teaching of the wise is a fountain of life, turning a person away from the snares of death. జ్ఞానుల బోధ ఒక జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
15 Good sense wins favor, but the way of the treacherous is their undoing. మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.
16 Every prudent person acts with knowledge, but a fool flaunts his foolishness. వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.
17 A wicked messenger falls into trouble, but a faithful envoy brings healing. దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.
18 Poverty and shame come to whoever ignores discipline, but the one who heeds correction is honored. శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.
19 A desire fulfilled is sweet to the soul, but turning away from evil is detestable to fools. ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము.
20 Whoever walks with the wise grows wise, but the companion of fools suffers harm. జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు.
21 Disaster pursues sinners, but good rewards the righteous. కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును.
22 A good person leaves an inheritance to his grandchildren, but the sinner's wealth is stored up for the righteous. మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.
23 The unplowed field of the poor could yield abundant food, but it is swept away for lack of justice. దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది కాని అన్యాయస్థులు రు.
24 Whoever withholds the rod hates his son, but the one who loves him is diligent to discipline him. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.
25 The righteous eats to his heart's content, but the belly of the wicked goes hungry. నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]