Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 12 OTSA

Show OTSA only
Verse × ×
1 Whoever loves discipline loves knowledge, but whoever hates correction is senseless. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.
2 A good man obtains favor from our Father, but he condemns the man who schemes evil. మంచివారు యెహోవా దయ పొందుతారు, చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు.
3 No one is established by wickedness, but the root of the righteous will never be moved. చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.
4 A wife of noble character is her husband's crown, but one who brings shame is like decay in his bones. మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.
5 The plans of the righteous are just, but the advice of the wicked is deceitful. నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి.
6 The words of the wicked lie in wait for blood, but the speech of the upright rescues the innocent. దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.
7 The wicked are overthrown and are no more, but the house of the righteous will stand. దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.
8 A person is praised according to their good sense, but one with a warped mind is despised. మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
9 Better to be lowly and have a servant than to pretend to greatness and go hungry. ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.
10 The righteous care for the needs of their animals, but even the mercy of the wicked is cruel. నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి.
11 Whoever works their land will have plenty of food, but whoever chases worthless pursuits lacks sense. తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు.
12 The wicked crave the plunder of evil men, but the root of the righteous yields fruit. దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది.
13 An evil man is trapped by his sinful talk, but the righteous escapes from trouble. కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు.
14 From the fruit of their words a person is filled with good things, and the work of their hands comes back to reward them. ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు, ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది.
15 The way of a fool seems right in his own eyes, but the wise listen to advice. మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు.
16 A fool shows his anger at once, but the prudent overlook an insult. మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
17 Whoever speaks the truth gives honest testimony, but a false witness tells lies. నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు.
18 Reckless words pierce like a sword, but the tongue of the wise brings healing. నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.
19 Truthful lips endure forever, but a lying tongue lasts only a moment. నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.
20 Deceit fills the hearts of those who plot evil, but joy belongs to those who promote peace. కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.
21 No harm overtakes the righteous, but the wicked are full of trouble. నీతిమంతులకు ఏ ఆపద రాదు దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది.
22 Lying lips are detestable to our Father, but those who act faithfully are his delight. అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.
23 The prudent keep their knowledge to themselves, but the heart of fools blurts out foolishness. వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.
24 Diligent hands will rule, but laziness ends in forced labor. శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు కానీ సోమరులు బానిసలవుతారు.
25 Anxiety weighs down the heart, but a kind word cheers it up. ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది, దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి.
26 The righteous guide their neighbor, but the way of the wicked leads them astray. నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.
27 The lazy do not roast their game, but the diligent prize their possessions. సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు.
28 In the path of righteousness there is life, and along that way there is no death. నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]