Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 11 OTSA

Show OTSA only
Verse × ×
1 Dishonest scales are an abomination to our Father, but accurate weights are his delight. మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.
2 When pride comes, then comes disgrace, but wisdom comes with the humble. గర్వము వెంబడి అవమానం వస్తుంది, కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.
3 The integrity of the upright guides them, but the crookedness of the treacherous destroys them. యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.
4 Wealth does not profit in the day of wrath, but righteousness delivers from death. ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
5 The righteousness of the blameless makes their way straight, but the wicked falls by his own wickedness. నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు.
6 The righteousness of the upright delivers them, but the treacherous are trapped by their own craving. యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది, కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు.
7 When a wicked person dies, his hope perishes, and his confidence in his own strength comes to nothing. దుష్టులైన మనుష్యుల ఆశ వారితోనే చస్తుంది; వారు బలవంతులుగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలన్ని శూన్యమవుతాయి.
8 The righteous is delivered from trouble, and the wicked comes into it in his place. నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు కాని దుష్టులు దానిలో పడతారు.
9 With his mouth the godless destroys his neighbor, but through knowledge the righteous are delivered. దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది, తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు.
10 When things go well for the righteous, the city rejoices, and when the wicked perish, there are shouts of joy. నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం; దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి.
11 By the blessing of the upright a city is exalted, but by the mouth of the wicked it is torn down. యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది, కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది.
12 Whoever despises his neighbor lacks sense, but a person of understanding stays silent. తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు, కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు.
13 A gossip goes about revealing secrets, but someone with a trustworthy spirit can keep a secret. పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది, కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు.
14 Where there is no guidance, a people falls, but in an abundance of counselors there is safety. ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది, కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది.
15 Whoever puts up security for a stranger will surely suffer for it, but whoever hates shaking hands on a pledge is secure. ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.
16 A gracious woman attains honor, and ruthless men attain riches. దయ మర్యాద కలిగిన స్త్రీ గౌరవాన్ని సంపాదిస్తుంది, క్రూరులు కేవలం ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు.
17 A kind person benefits himself, but a cruel person brings trouble on himself. దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు.
18 The wicked earns deceptive wages, but whoever sows righteousness earns a true reward. దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.
19 Whoever is steadfast in righteousness finds life, but whoever pursues evil runs to his own death. నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు, చెడును వెంటాడేవాడు మరణాన్ని కనుగొంటాడు.
20 Those of crooked heart are an abomination to our Father, but those whose ways are blameless are his delight. వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.
21 You can be sure the evil person will not go unpunished, but the children of the righteous will go free. ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు, నీతిమంతులు విడిపించబడతారు.
22 Like a gold ring in a pig's snout is a beautiful woman who shows no discretion. మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
23 The desire of the righteous ends only in good, but the hope of the wicked ends in wrath. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది.
24 One person gives freely, yet grows all the richer; another withholds what is right, only to end up in need. ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.
25 A generous soul will be enriched, and whoever refreshes others will himself be refreshed. దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
26 The people curse whoever holds back grain, but the one who sells it is blessed. ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు, వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి.
27 Whoever diligently seeks good seeks favor, but whoever searches for evil, evil will come to him. మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు, కీడు చేసేవారికి కీడే కలుగుతుంది.
28 Whoever trusts in his riches will fall, but the righteous will flourish like green leaves. సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.
29 Whoever brings trouble on his own household will inherit the wind, and the fool will be servant to the wise of heart. తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.
30 The fruit of the righteous is a tree of life, and whoever wins souls is wise. నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది, జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు.
31 If the righteous is repaid on earth, how much more the wicked and the sinner! నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]