Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 10 OTSA

Show OTSA only
Verse × ×
1 The proverbs of Solomon: A wise son brings joy to his father, but a foolish son brings grief to his mother. సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.
2 Treasures gained by wickedness do not profit, but righteousness rescues from death. అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
3 Our Father will not let the righteous go hungry, but he thwarts the craving of the wicked. యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు.
4 Lazy hands make you poor, but diligent hands bring wealth. సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.
5 He who gathers in summer is a prudent son, but he who sleeps during harvest is a son who brings shame. వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.
6 Blessings rest on the head of the righteous, but the mouth of the wicked conceals violence. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది.
7 The memory of the righteous is a blessing, but the name of the wicked will rot. నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది, కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది.
8 A wise heart accepts commands, but a babbling fool comes to ruin. జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.
9 Whoever walks in integrity walks securely, but he who makes his ways crooked will be found out. యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.
10 Whoever winks causes trouble, and a babbling fool comes to ruin. కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.
11 The mouth of the righteous is a fountain of life, but the mouth of the wicked conceals violence. నీతిమంతుల నోరు జీవపుఊట, కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది.
12 Hatred stirs up conflict, but love covers all offenses. పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.
13 On the lips of the discerning, wisdom is found, but a rod is for the back of one who lacks sense. వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.
14 The wise store up knowledge, but the mouth of a fool invites ruin. జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.
15 The wealth of the rich is their fortified city; the ruin of the poor is their poverty. ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, కాని దరిద్రత పేదవారి నాశనం.
16 The wage of the righteous leads to life; the gain of the wicked leads to sin. నీతిమంతుల కష్టార్జితం జీవం, కాని దుష్టుల సంపాదన పాపం, మరణం.
17 Whoever accepts discipline is on the path to life, but he who ignores correction leads others astray. క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.
18 Whoever conceals hatred is a liar, and whoever spreads slander is a fool. పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.
19 Where words are many, sin is never absent; but whoever holds his tongue is wise. విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.
20 The tongue of the righteous is choice silver; the heart of the wicked is worth little. నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది.
21 The lips of the righteous nourish many, but fools die for lack of sense. నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.
22 The blessing of our Father brings wealth, and he adds no sorrow with it. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.
23 Doing wickedness is a game to a fool, but wisdom is the delight of a person of understanding. బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.
24 What the wicked dreads will come upon him, but the desire of the righteous will be granted. దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.
25 When the storm has passed, the wicked are gone, but the righteous are established forever. సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.
26 Like vinegar to the teeth and smoke to the eyes, so is the sluggard to those who send him. పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.
27 The fear of our Father lengthens life, but the years of the wicked will be cut short. యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.
28 The hope of the righteous brings joy, but the expectation of the wicked will perish. నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.
29 The way of our Father is a refuge for the blameless, but ruin for those who do evil. నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.
30 The righteous will never be shaken, but the wicked will not remain in the land. నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.
31 The mouth of the righteous yields wisdom, but the perverse tongue will be cut off. నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది.
32 The lips of the righteous know what is acceptable, but the mouth of the wicked, only what is perverse. నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]