Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 9 OTSA

Show OTSA only
Verse × ×
1 Wisdom has built her house; she has hewn out her seven pillars. జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది.
2 She has slaughtered her animals; she has mixed her wine; she has also set her table. ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.
3 She has sent out her young women to call from the highest places of the town: ఆమె తన దాసులను బయటకు పంపి, పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి,
4 "Whoever is simple, let him come in here!" To the one who lacks sense she says, “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
5 "Come, eat my bread and drink the wine I have mixed. “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి. నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి.
6 Leave your simple ways, and live; walk in the way of insight." ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి; తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.”
7 Whoever corrects a mocker brings abuse on himself, and whoever rebukes a wicked man gets hurt. వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.
8 Do not rebuke a mocker, or he will hate you; rebuke a wise man, and he will love you. హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు; తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
9 Instruct a wise man and he will grow wiser; teach a righteous man and he will learn even more. జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు; మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.
10 The fear of our Father is the beginning of wisdom, and the knowledge of the Holy One is insight. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.
11 For by me your days will be multiplied, and years will be added to your life. జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి.
12 If you are wise, you are wise for yourself; if you scoff, you alone will bear it. నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.
13 The woman Folly is loud; she is naive and knows nothing. బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.
14 She sits at the door of her house, on a seat at the highest places of the town, ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,
15 calling to those who pass by, who are going straight on their way: ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,
16 "Whoever is simple, let him come in here!" And to the one who lacks sense she says, “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
17 "Stolen water is sweet, and bread eaten in secret is pleasant." “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!”
18 But he does not know that the dead are there, that her guests are in the depths of the grave. అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]