Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 8 OTSA

Show OTSA only
Verse × ×
1 Does not Wisdom call out, and understanding raise her voice? జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా?
2 Atop the heights along the way, where the paths meet, she takes her stand. కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది;
3 Beside the gates, at the entrance to the city, at the doorways she cries aloud: పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది:
4 "To you, all people, I call out; my voice reaches all humanity. మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను.
5 You who are simple, learn prudence; you who are foolish, gain an understanding heart. అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి.
6 Listen, for I speak of noble things, and everything I say is right. వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి.
7 My mouth utters truth, for my lips detest wickedness. నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.
8 All the words of my mouth are righteous; none of them is twisted or crooked. నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు.
9 To the one who understands they are all clear, and right to those who find knowledge. నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి.
10 Take my instruction instead of silver, and knowledge rather than choice gold, వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి.
11 for wisdom is better than jewels, and nothing you desire can compare with her. జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు.
12 I, Wisdom, dwell with prudence, and I find knowledge and discretion. “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి.
13 The fear of our Father is to hate evil. Pride and arrogance, the evil way, and perverse speech I hate. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.
14 Counsel is mine, and sound wisdom; I am understanding; strength is mine. ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే.
15 By me kings reign, and rulers decree what is just; నా వలననే రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు; పాలకులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు.
16 by me princes govern, and nobles—all who rule with justice. నా వలననే రాజకుమారులు ఏలుతారు, నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు.
17 I love those who love me, and those who search for me find me. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను.
18 With me are riches and honor, enduring wealth and righteousness. ఐశ్వర్యం, గౌరవం, స్ధిరమైన ఆస్తి, నీతి నా దగ్గర ఉన్నాయి.
19 My fruit is better than gold, than the finest gold, and what I yield surpasses choice silver. మేలిమి బంగారముకంటెను నా వలన కలిగే ఫలం మంచిది; శ్రేష్ఠమైన వెండికంటెను నా వలన కలిగే లాభం గొప్పది.
20 I walk in the way of righteousness, along the paths of justice, నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను.
21 giving wealth as an inheritance to those who love me, and filling their treasuries. నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను.
22 Our Father brought me forth at the beginning of his way, before his works of old. “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు;
23 From ages past I was established, from the beginning, before the earth began. మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను.
24 When there were no deep waters I was brought forth, when there were no springs overflowing with water. ప్రవహించే కాలువలు లేనప్పుడు నీళ్లతో నిండి ఉన్న నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టాను.
25 Before the mountains were settled, before the hills, I was brought forth, పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు,
26 while he had not yet made the earth and its fields, or the first dust of the world. భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని.
27 When he set the heavens in place, I was there; when he drew a circle over the face of the deep, దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని.
28 when he set the skies in place above, when he established the springs of the deep, దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు,
29 when he set for the sea its boundary so the waters would not cross their limits, when he marked out the foundations of the earth, నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు.
30 then I was beside him as a master craftsman, and I was his daily delight, rejoicing before him always, నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను,
31 rejoicing in his whole world, and delighting in the human family. దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను.
32 And now, my children, listen to me: blessed are those who keep my ways. “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు.
33 Listen to instruction and be wise; do not ignore it. నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి.
34 Blessed is the one who listens to me, watching daily at my gates, waiting beside my doorway. ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు.
35 For whoever finds me finds life and receives favor from our Father. నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు.
36 But whoever misses me harms his own soul; all who hate me love death." నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు; నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]