Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 7 OTSA

Show OTSA only
Verse × ×
1 My son, keep my words, and store up my commandments within you. నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.
2 Keep my commandments and live; guard my teaching as the apple of your eye. నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు.
3 Bind them on your fingers; write them on the tablet of your heart. నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో.
4 Say to wisdom, "You are my sister," and call understanding your dearest friend, జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.”
5 to keep you from the forbidden woman, from the stranger with her smooth words. అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
6 For at the window of my house I looked down through my lattice, నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.
7 and I saw among the naive, I noticed among the young men, a youth who lacked sense, బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను.
8 passing through the street near her corner, taking the road to her house, అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, దాని ఇంటి వైపే నడుస్తున్నాడు
9 in the twilight, as the day faded, in the dark of night and gloom. అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి.
10 And there a woman comes to meet him, dressed like a prostitute, with cunning in her heart. అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది.
11 She is loud and defiant; her feet will not stay at home. (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు;
12 Now in the street, now in the squares, she lurks at every corner. అది వీధుల్లో తిరుగుతుంది, ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.)
13 She grabs him and kisses him, and with a brazen face she says to him: అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది:
14 "I had peace offerings to bring; today I have paid my vows. “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.
15 So I came out to meet you, to look for you eagerly, and I have found you. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!
16 I have spread my bed with coverings, with colored linens from Egypt. నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన రంగుల నార దుప్పట్లు పరిచాను.
17 I have perfumed my bed with myrrh, aloes, and cinnamon. నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను.
18 Come, let us drink deep of love until morning; let us lose ourselves in love. తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం!
19 For my husband is not at home; he has gone on a long journey. నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు.
20 He took a bag of money with him and will not come home until the full moon." అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.”
21 With all her persuasive words she sways him; with her smooth lips she draws him in. ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.
22 All at once he follows her, like an ox going to the slaughter, like a deer stepping into a snare, అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,
23 until an arrow pierces its liver; like a bird darting into a trap, he does not know it will cost him his life. తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.
24 Now then, my sons, listen to me, and pay attention to what I say. కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.
25 Do not let your heart turn aside to her ways; do not wander into her paths. వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.
26 For she has brought down many victims; her slain are a mighty multitude. అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; అది పడద్రోసిన వారు అనేకులు.
27 Her house is the road to the grave, going down to the chambers of death. దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]