Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 6 OTSA

Show OTSA only
Verse × ×
1 My son, if you have put up security for your neighbor, if you have shaken hands in pledge for a stranger, నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
2 you have been snared by the words of your mouth, caught by the words of your mouth. నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
3 Then do this, my son, and free yourself, for you are now at your neighbor's mercy: go, humble yourself, and plead with your neighbor. నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు, కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి: వెళ్లి అలసిపోయేవరకు, నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!
4 Give no sleep to your eyes, no slumber to your eyelids. నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.
5 Free yourself like a gazelle from the hand, like a bird from the hand of the trapper. వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా, బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.
6 Go to the ant, you sluggard; consider her ways and be wise. సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
7 Without having any chief, officer, or ruler, వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,
8 she prepares her bread in summer and gathers her food in harvest. అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.
9 How long will you lie there, sluggard? When will you arise from your sleep? సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు?
10 A little sleep, a little slumber, a little folding of the hands to rest, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు.
11 and poverty will come upon you like a robber, and scarcity like an armed man. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
12 A worthless person, a wicked man, goes about with crooked speech, వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.
13 winks with his eyes, signals with his feet, points with his fingers, వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, తన పాదాలతో సైగలు చేస్తూ తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.
14 with perverted heart he devises evil, continually sowing discord; అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు, అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు.
15 therefore calamity will come upon him suddenly; in a moment he will be broken beyond healing. కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది; వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు.
16 There are six things our Father hates, seven that are detestable to him: యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.
17 haughty eyes, a lying tongue, and hands that shed innocent blood, అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.
18 a heart that devises wicked plans, feet that hurry to run to evil, చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు,
19 a false witness who breathes out lies, and one who sows discord among brothers. అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
20 My son, keep your father's commandment, and do not forsake your mother's teaching. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.
21 Bind them on your heart always; tie them around your neck. వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
22 When you walk, they will lead you; when you lie down, they will watch over you; and when you awake, they will talk with you. నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.
23 For the commandment is a lamp and the teaching a light, and the reproofs of discipline are the way of life, ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,
24 to keep you from the evil woman, from the smooth tongue of the adulteress. వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.
25 Do not desire her beauty in your heart, and do not let her capture you with her eyelashes; నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.
26 for the price of a prostitute is only a loaf of bread, but a married woman hunts down a precious life. ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.
27 Can a man carry fire next to his chest and his clothes not be burned? ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?
28 Or can one walk on hot coals and his feet not be scorched? తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?
29 So is he who sleeps with his neighbor's wife; none who touches her will go unpunished. మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.
30 People do not despise a thief if he steals to satisfy his appetite when he is hungry, ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.
31 but if he is caught, he will pay sevenfold; he will give all the goods of his house. అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.
32 He who commits adultery lacks sense; he who does it destroys himself. అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.
33 He will get wounds and dishonor, and his disgrace will not be wiped away. దెబ్బలు, అవమానం వాని భాగం, వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
34 For jealousy makes a man furious, and he will show no mercy in the day of vengeance. ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.
35 He will accept no compensation; he will refuse no matter how large the bribe. అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]