Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 19 OTSA

Show OTSA only
Verse × ×
1 Better is a poor person who walks in his integrity than one whose words are crooked and is a fool. నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే నిజాయితీగా ఉంటే మంచిది.
2 Also, desire without knowledge is not good, and whoever acts in haste misses the way. ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.
3 A person's own foolishness ruins his way, yet his heart rages against our Father. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.
4 Wealth adds many friends, but the poor is separated from his friend. డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు.
5 A false witness will not go unpunished, and one who breathes out lies will not escape. అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.
6 Many seek the favor of a generous person, and everyone is a friend to one who gives gifts. అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.
7 All the brothers of a poor person hate him; how much more do his friends keep far from him! He calls after them, but they are gone. పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.
8 Whoever gets wisdom loves his own soul; whoever guards understanding will find good. తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.
9 A false witness will not go unpunished, and one who breathes out lies will perish. అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.
10 Luxury is not fitting for a fool—much less for a servant to rule over princes. భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు.
11 The good sense of a person makes him slow to anger, and it is his glory to overlook an offense. ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.
12 A king's wrath is like the roaring of a lion, but his favor is like dew on the grass. రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.
13 A foolish son is ruin to his father, and a wife's quarreling is a continual dripping. బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.
14 House and wealth are an inheritance from one's ancestors, but a prudent wife is from our Father. ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
15 Laziness casts into deep sleep, and an idle person will go hungry. సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.
16 Whoever keeps the commandment keeps his life; whoever despises his ways will die. ఆజ్ఞను పాటించేవాడు తనను తాను కాపాడుకుంటాడు, కానీ తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలేనివాడు చస్తాడు.
17 Whoever is generous to the poor lends to our Father, and our Father will repay him for his deed. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.
18 Discipline your son while there is hope, and do not set your heart on his destruction. ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు.
19 A person of great wrath must pay the penalty; for if you rescue him, you will only have to do it again. మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.
20 Listen to counsel and accept discipline, that you may gain wisdom in the days to come. నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.
21 Many are the plans in a person's heart, but it is the counsel of our Father that will stand. ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
22 What is desired in a person is covenant love, and a poor person is better than a liar. ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు.
23 The fear of our Father leads to life, and whoever has it rests satisfied, untouched by harm. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
24 The sluggard buries his hand in the dish and will not even bring it back to his mouth. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
25 Strike a mocker, and the simple will learn prudence; reprove a person of understanding, and he will gain knowledge. ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు.
26 Whoever does violence to his father and drives away his mother is a son who brings shame and disgrace. తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు.
27 Stop listening to instruction, my son, and you will stray from the words of knowledge. నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.
28 A worthless witness mocks at justice, and the mouth of the wicked gulps down wickedness. అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది.
29 Punishment is prepared for mockers, and beatings for the backs of fools. హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]