Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 20 OTSA

Show OTSA only
Verse × ×
1 Wine is a mocker, strong drink a brawler, and whoever staggers under it is not wise. మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.
2 The terror of a king is like the growl of a lion; whoever provokes him to anger forfeits his own life. రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది; రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు.
3 It is an honor for a person to keep clear of strife, but every fool is quick to quarrel. తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.
4 A lazy person will not plow in autumn; so at harvest he looks for a crop and finds nothing. విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.
5 The purposes of a person's heart are deep waters, but one who has understanding draws them out. మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.
6 Many a person proclaims his own loyal love, but a faithful one—who can find? తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?
7 The righteous walk in their integrity; blessed are their children after them! నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
8 A king seated on the throne of judgment winnows out all evil with his eyes. న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.
9 Who can say, "I have kept my heart pure; I am cleansed from my sin"? “నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?
10 Unequal weights and unequal measures—our Father detests them both. తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు, ఈ రెండును యెహోవాకు అసహ్యం.
11 Even a child is known by his actions, by whether his conduct is pure and upright. చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.
12 The hearing ear and the seeing eye—our Father made them both. వినుటకు చెవి చూచుటకు కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవే.
13 Do not love sleep, or you will grow poor; open your eyes, and you will have plenty of bread. నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.
14 "Worthless, worthless!" says the buyer—then off he goes and boasts of his bargain. కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు.
15 There is gold and an abundance of jewels, but lips that speak knowledge are a rare treasure. బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం.
16 Take the garment of one who puts up security for a stranger; hold it as a pledge when he does so for foreigners. అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
17 Bread gained by deceit tastes sweet, but afterward the mouth is full of gravel. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది. తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది.
18 Plans are established by counsel; so wage war only with wise guidance. ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.
19 A gossip betrays a confidence; so do not keep company with a babbler. పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.
20 Whoever curses his father or mother—his lamp will be snuffed out in deepest darkness. తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.
21 An inheritance gained too quickly at the start will not be blessed in the end. జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు.
22 Do not say, "I will pay back evil for evil." Wait for our Father, and he will deliver you. కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
23 Our Father detests unequal weights, and dishonest scales are no good. మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం.
24 A person's steps are directed by our Father; how then can anyone understand his own way? ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
25 It is a trap to rashly dedicate something and only later reconsider the vow. మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది, తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది.
26 A wise king winnows out the wicked and drives the threshing wheel over them. జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.
27 The human spirit is the lamp of our Father, searching every inmost part. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.
28 Loyal love and faithfulness preserve a king; by loyal love his throne is upheld. దయ, సత్యాలు రాజును కాపాడతాయి దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు.
29 The glory of the young is their strength, but the splendor of the old is gray hair. బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.
30 Wounding blows scrub away evil, and beatings cleanse the inmost parts. బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి చెడుతనాన్ని తొలగిస్తాయి.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]