Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 21 OTSA

Show OTSA only
Verse × ×
1 The king's heart is a stream of water in our Father's hand; he turns it wherever he pleases. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.
2 Every way of a person seems right in their own eyes, but our Father weighs the heart. ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.
3 To do what is right and just is more pleasing to our Father than sacrifice. మనం బలులు అర్పించడం కంటే మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.
4 Haughty eyes and a proud heart—the lamp of the wicked—are sin. అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.
5 The plans of the diligent lead surely to abundance, but all who are hasty end up in poverty. శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి, తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది.
6 Making a fortune by a lying tongue is a fleeting vapor, a deadly trap. అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.
7 The violence of the wicked will drag them away, because they refuse to do what is just. దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది, ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.
8 The way of the guilty is crooked, but the conduct of the pure is upright. అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది.
9 Better to live in a corner of the roof than in a shared house with a quarrelsome wife. గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే, మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
10 The soul of the wicked craves evil; their neighbor finds no mercy in their eyes. దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది; తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.
11 When a mocker is punished, the simple grow wise; when the wise are instructed, they gain knowledge. ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు; జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు.
12 Our Father, the Righteous One, observes the house of the wicked and brings the wicked to ruin. నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి, దుష్టులను నాశనం చేస్తాడు.
13 Whoever shuts their ears to the cry of the poor will also cry out and not be answered. బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.
14 A gift given in secret soothes anger, and a bribe slipped into the cloak calms strong wrath. చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.
15 When justice is done, it is a joy to the righteous but terror to those who do evil. న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము.
16 A person who strays from the way of understanding will rest in the assembly of the dead. వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి మృతుల గుంపులో అంతమవుతాడు.
17 Whoever loves pleasure will become poor; whoever loves wine and oil will never grow rich. సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.
18 The wicked become a ransom for the righteous, and the treacherous for the upright. నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.
19 Better to live in a desert land than with a quarrelsome and complaining wife. ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది.
20 Precious treasure and oil are in the home of the wise, but a fool devours all he has. జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.
21 Whoever pursues righteousness and faithful love will find life, righteousness, and honor. నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
22 A wise person scales the city of the mighty and brings down the stronghold they trust in. జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.
23 Whoever guards their mouth and tongue keeps themselves out of trouble. నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,
24 "Mocker" is the name of the proud and arrogant who acts with outrageous insolence. అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.
25 The craving of a lazy person kills him, for his hands refuse to work. సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.
26 All day long the craving grows, but the righteous give and do not hold back. పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.
27 The sacrifice of the wicked is detestable—how much more when brought with evil intent. దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!
28 A false witness will perish, but whoever listens will testify with lasting effect. అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.
29 The wicked put on a bold face, but the upright give thought to their ways. దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.
30 There is no wisdom, no understanding, no counsel that can stand against our Father. యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.
31 The horse is made ready for the day of battle, but victory belongs to our Father. యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]