Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 22 OTSA

Show OTSA only
Verse × ×
1 A good name is to be chosen rather than great riches, and favor is better than silver or gold. గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.
2 The rich and the poor meet together; our Father is the Maker of them all. ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
3 The prudent sees danger and takes cover, but the simple keep going and pay the price. వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
4 The reward for humility and the fear of our Father is riches and honor and life. యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
5 Thorns and snares lie in the path of the crooked; whoever guards his soul stays far from them. దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.
6 Train up a child in the way he should go, and even when he is old he will not depart from it. మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
7 The rich rules over the poor, and the borrower is slave to the lender. ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.
8 Whoever sows injustice will reap calamity, and the rod of his fury will fail. దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.
9 Whoever has a generous eye will be blessed, for he shares his bread with the poor. ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
10 Drive out the scoffer, and strife goes with him; quarreling and abuse will cease. ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి; తగాదాలు అవమానాలు ముగిశాయి.
11 Whoever loves a pure heart and speaks graciously will have the king as his friend. శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు.
12 The eyes of our Father keep watch over knowledge, but he overturns the words of the traitor. యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.
13 The lazy person says, "There is a lion outside! I will be killed in the streets!" సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”
14 The mouth of forbidden women is a deep pit; whoever draws our Father's anger will fall into it. వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.
15 Foolishness is bound up in the heart of a child, but the rod of discipline drives it far away. యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.
16 Whoever oppresses the poor to enrich himself, or gives to the rich, will come only to poverty. లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.
17 Listen carefully to the words of the wise, and apply your heart to my knowledge, చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి.
18 for it will be pleasant if you keep them within you, if all of them are ready on your lips. ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది.
19 So that your trust may be in our Father, I have made them known to you today, even to you. మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.
20 Have I not written for you thirty sayings of counsel and knowledge, మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా?
21 to teach you what is right and true, so that you may give a true answer to those who sent you? Not in this edition
22 Do not rob the poor because he is poor, or crush the afflicted at the gate, పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,
23 for our Father will plead their cause and will rob of life those who rob them. యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
24 Do not befriend a man given to anger, and do not go with a hot-tempered man, కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,
25 or you will learn his ways and entangle yourself in a snare. నీవు వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.
26 Do not be one of those who give pledges, who put up security for debts. చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;
27 If you have nothing to pay with, why should your bed be taken from under you? ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.
28 Do not move the ancient boundary stone that your fathers set up. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29 Do you see a man skillful in his work? He will stand before kings; he will not stand before ordinary men. తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]