Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 23 OTSA

Show OTSA only
Verse × ×
1 When you sit down to dine with a ruler, consider carefully what is before you, మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి.
2 and put a knife to your throat if you are a person ruled by appetite. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో.
3 Do not crave his delicacies, for they are deceptive food. అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, అవి మోసగించే ఆహారపదార్థాలు.
4 Do not wear yourself out to get rich; have the wisdom to restrain yourself. సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
5 The moment you look at wealth, it is gone, for it suddenly sprouts wings and flies off toward the heavens like an eagle. కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
6 Do not eat the bread of a stingy man, and do not crave his delicacies, ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,
7 for he is the kind of man who keeps counting the cost. "Eat and drink!" he says to you, but his heart is not with you. ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.
8 You will vomit up the little you have eaten and will have wasted your pleasant words. నీవు తినిన కొంచెము కక్కివేస్తావు నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి.
9 Do not speak in the hearing of a fool, for he will despise the wisdom of your words. బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.
10 Do not move an ancient boundary stone or encroach on the fields of the fatherless, పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు,
11 for their Redeemer is strong; our Father will take up their cause against you. ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.
12 Apply your heart to instruction and your ears to words of knowledge. ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.
13 Do not withhold discipline from a child; if you strike him with the rod, he will not die. నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.
14 Strike him with the rod, and you will deliver his soul from the grave. బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.
15 My son, if your heart is wise, my own heart will be glad as well. నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;
16 My inmost being will rejoice when your lips speak what is right. నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది.
17 Do not let your heart envy sinners, but continue in the fear of our Father all day long. పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.
18 Surely there is a future, and your hope will not be cut off. నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.
19 Hear, my son, and be wise, and keep your heart on the right road. నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో.
20 Do not be among those who get drunk on wine or those who gorge themselves on meat, అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను, మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు.
21 for the drunkard and the glutton will come to poverty, and drowsiness will clothe them in rags. ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.
22 Listen to your father, who gave you life, and do not despise your mother when she is old. నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.
23 Buy truth and do not sell it; buy wisdom, instruction, and understanding. సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.
24 The father of a righteous child will greatly rejoice; whoever fathers a wise son will delight in him. నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.
25 Let your father and mother be glad; let her who gave you birth rejoice. నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక!
26 My son, give me your heart, and let your eyes delight in my ways. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు నీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక,
27 For a prostitute is a deep pit, and an adulterous woman is a narrow well. ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి.
28 She lies in wait like a robber and leads many men into faithlessness. బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.
29 Who has misery? Who has sorrow? Who has strife? Who has complaints? Who has wounds for no reason? Who has bleary eyes? ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?
30 Those who linger long over wine, those who go to sample bowls of mixed wine. మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.
31 Do not gaze at wine while it is red, while it sparkles in the cup and goes down smoothly. మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!
32 In the end it bites like a serpent and stings like a viper. అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.
33 Your eyes will see strange things, and your heart will utter twisted things. నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి, నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది.
34 You will be like one lying down in the heart of the sea, like one lying on the top of a ship's mast. నీవు నడిసముద్రంలో పడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు.
35 "They struck me, but I felt no pain; they beat me, but I did not know it. When will I wake up? I will look for another drink." “వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! మరి కాస్త మద్యం త్రాగడానికి నేనెప్పుడు నిద్ర లేస్తాను?”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]