Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 23 OTSA

Side by side with the Father's Heart Bible™

సూక్తి 7

1మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు,మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి.

2నీవు తిండిబోతువైన ఎడలనీ గొంతుకు కత్తి పెట్టుకో.

3అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు,అవి మోసగించే ఆహారపదార్థాలు.

సూక్తి 8

4సంపదను పొందడానికి ప్రయాసపడకండి;నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.

5కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది,ఎందుకంటే అది రెక్కలు ధరించిగ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.

సూక్తి 9

6ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి,అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,

7ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలోఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు.“తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు,కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.

8నీవు తినిన కొంచెము కక్కివేస్తావునీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి.

సూక్తి 10

9బుద్ధిహీనులతో మాట్లాడకండి,ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.

సూక్తి 11

10పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దుతండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు,

11ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు;నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.

సూక్తి 12

12ఉపదేశానికి నీ హృదయాన్నితెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.

సూక్తి 13

13నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము;ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.

14బెత్తముతో వాని శిక్షించిచావు నుండి వారిని కాపాడండి.

సూక్తి 14

15నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే,అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;

16నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు,నా అంతరింద్రియం సంతోషిస్తుంది.

సూక్తి 15

17పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు,కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.

18నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది,నీ నిరీక్షణ తొలగించబడదు.

సూక్తి 16

19నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండునీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో.

20అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను,మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు.

21ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు,మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.

సూక్తి 17

22నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు,నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.

23సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకుజ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.

24నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం;జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.

25నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక;నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక!

సూక్తి 18

26నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వునీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక,

27ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట,దారితప్పిన భార్య ఇరుకైన బావి.

28బందిపోటులా అది పొంచి ఉంటుందిఅది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.

సూక్తి 19

29ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది?ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి?ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?

30మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు,నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.

31మద్యం ఎర్రగా ఉన్నప్పుడు,గిన్నెలో తళతళలాడుతూ,గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!

32అంతంలో అది పాములా కరుస్తుందికట్లపాములా విషం చిమ్ముతుంది.

33నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి,నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది.

34నీవు నడిసముద్రంలోపడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు.

35“వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు!వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు!మరి కాస్త మద్యం త్రాగడానికినేనెప్పుడు నిద్ర లేస్తాను?”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]