Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 21 OTSA

Side by side with the Father's Heart Bible™

1యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.

2ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు,కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.

3మనం బలులు అర్పించడం కంటేమనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.

4అహంకారపు చూపు గర్వ హృదయందుష్ట క్రియలన్నీ పాపమే.

5శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి,తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది.

6అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యంక్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.

7దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది,ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.

8అపరాధి యొక్క మార్గం వంకర,అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది.

9గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే,మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.

10దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది;తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.

11ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు;జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు.

12నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి,దుష్టులను నాశనం చేస్తాడు.

13బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు,తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.

14చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది,ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.

15న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరంకాని చెడు చేసేవారికి అది భయంకరము.

16వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తిమృతుల గుంపులో అంతమవుతాడు.

17సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది;ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.

18నీతిమంతుల కోసం భక్తిలేనివారు,అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.

19ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటేఅడవిలో నివసించడం మంచిది.

20జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి,కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.

21నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడుప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.

22జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లివారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.

23నోటిని నాలుకను భద్రం చేసుకునేవారుకష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,

24అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరువారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.

25సోమరుల కోరికలు వారిని చంపుతాయి,ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.

26పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు,కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.

27దుష్టుల బలులు అసహ్యం,చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!

28అబద్ధ సాక్షులు నశిస్తారు,కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.

29దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు,కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.

30యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగలజ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.

31యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి,కాని విజయం యెహోవా దగ్గర ఉంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]