Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ecclesiastes 11 OTSA

Side by side with the Father's Heart Bible™

అనేక చోట్ల పెట్టుబడి

1మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి;చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.

2ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి;దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు.

3ఒకవేళ మేఘాల నిండా నీళ్లు ఉంటే,అవి భూమిపై వర్షిస్తాయి.ఒక చెట్టు దక్షిణంగా కూలినా ఉత్తరంగా కూలినా,అది పడిన చోటనే ఉంటుంది.

4గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు;మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు.

5మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే,తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా,అన్నిటిని చేసినవాడైనదేవుని క్రియలు మీకు అర్థం కావు.

6ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి,సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి,ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో,లేదా రెండు సమానంగా ఫలిస్తాయో,మీకు తెలియదు.

బాల్యంలోనే మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి

7వెలుగు ఆహ్లాదకరమైనది,సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.

8ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే,అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి.అయితే చీకటి రోజులు చాలారాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి.రాబోయేదంతా అర్థరహితమే.

9యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి,మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండిమీ హృదయ కోరుకున్న వాటినిమీ కళ్లు చూసే వాటిని అనుభవించండి,కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్నితీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.

10కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి,మీ శరీర బాధలను వెళ్లగొట్టండి,ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]