Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 148 OTSA

Side by side with the Father's Heart Bible™

1యెహోవాను స్తుతించండి.పరలోకము నుండి యెహోవాను స్తుతించండి;ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.

2యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి;పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.

3సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి.మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.

4ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారాఆయనను స్తుతించండి.

5అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక,ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,

6ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు,ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.

7భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి,సమస్త సముద్రపు అగాధాల్లారా,

8మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు,ఈదురు గాలులు,

9పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా,ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా,

10మృగాలు, సమస్త పశువులారా,నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా,

11భూరాజులారా సమస్త దేశ ప్రజలారా,రాకుమారులారా, పాలకులారా,

12యువకులారా, కన్యలారా,వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి.

13వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక.ఆయన నామము మాత్రమే మహోన్నతం;ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.

14ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు,అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు,ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి.యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]