Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 26 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు కీర్తన.

1యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను,నాకు న్యాయం తీర్చండి;నేను ఏ సందేహం లేకుండయెహోవాను నమ్మాను.

2యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి,నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;

3నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటానుమీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.

4నేను మోసగాళ్ళతో కూర్చోను,వేషధారులతో నేను సహవాసం చేయను.

5కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యందుష్టులతో నేను కూర్చోను.

6యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని,బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూమీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూమీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.

8యెహోవా, మీరు నివసించే ఆవరణం,మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.

9పాపులతో పాటు నా ప్రాణాన్నినరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.

10వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి,వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.

11నేను నిందారహితంగా బ్రతుకుతాను;నన్ను విమోచించండి నన్ను కరుణించండి.

12నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను;గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]