Side by side with the Father's Heart Bible™ దావీదు కీర్తన.
1యెహోవాయే నాకు వెలుగు నా రక్షణనేను ఎవరికి భయపడతాను?దేవుడే నా జీవితానికి బలమైన కోటనేను ఎవరికి భయపడతాను?
2నన్ను మ్రింగివేయాలనిదుష్టులు నా మీదికి వచ్చినప్పుడు,నా శత్రువులు నా పగవారుతూలి పడిపోతారు.
3సైన్యం నన్ను ముట్టడించినా,నా హృదయం భయపడదు;నా మీదికి యుద్ధానికి వచ్చినా,నేను ధైర్యం కోల్పోను.
4యెహోవాను ఒకటి అడిగాను,నేను కోరింది ఇదే;యెహోవా ప్రసన్నతను చూస్తూఆయన మందిరంలో ఆయనను వెదకుతూనా జీవితకాలమంతానేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.
5ఆపద సంభవించిన దినానఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు;తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు,ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.
6నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే,నా తల పైకెత్తబడుతుందిఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను;నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.
7యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి;నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.
8“ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది,యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.
9మీ ముఖాన్ని నా నుండి దాచకండి,కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి;మీరే నాకు సహాయము.దేవా నా రక్షకా,నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి.
10నా తల్లిదండ్రులు నన్ను విడిచినా,యెహోవా నన్ను చేరదీస్తారు.
11యెహోవా, మీ మార్గం నాకు బోధించండి;నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు,కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.
12నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి,ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి,హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.
13నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను:సజీవులన్న చోటనేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.
14యెహోవా కోసం కనిపెట్టండినిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండియెహోవా కోసం కనిపెట్టండి.