Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 62 OTSA

Side by side with the Father's Heart Bible™

సీయోను యొక్క క్రొత్త పేరు

1సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు,దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు,సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను.యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.

2దేశాలు నీ నీతిని చూస్తాయి.రాజులందరూ నీ మహిమను చూస్తారు.యెహోవా నీకు ఇవ్వబోయేక్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.

3నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా,నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.

4ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు,నీ దేశం పాడైపోయిందని పిలువబడదు.అయితే నీవు హెఫ్సీబా అనినీ దేశం బ్యూలా అని పిలువబడుతుంది;యెహోవా నీలో ఆనందిస్తారునీ దేశానికి పెళ్ళి అవుతుంది.

5యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లునిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు;పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు,నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.

6యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను;పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు.యెహోవాకు మొరపెట్టే వారలారావిశ్రాంతి తీసుకోకండి,

7యెరూషలేమును స్థాపించే వరకుభూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.

8యెహోవా తన కుడిచేతితోతన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు:“ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్నినీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను.నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్నివిదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;

9అయితే పంట పండించిన వారే దానిని తినియెహోవాను స్తుతిస్తారు.ద్రాక్షలను సమకూర్చిన వారేనా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”

10రండి, గుమ్మాల ద్వారా రండి!ప్రజలకు మార్గం సిద్ధపరచండి.నిర్మించండి, రహదారిని నిర్మించండి!రాళ్లను తొలగించండి.దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.

11భూమి అంచుల వరకుయెహోవా చేస్తున్న ప్రకటన:“ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు!ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉందిఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అనిసీయోను కుమార్తెతో చెప్పండి.”

12వారు పరిశుద్ధ ప్రజలని,యెహోవా విడిపించినవారని పిలువబడతారు;నీవు అందరికి కావలసిన దానివనిపాడుబడని పట్టణమని పిలువబడతావు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]