Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 61 OTSA

Side by side with the Father's Heart Bible™

యెహోవా యొక్క దయా సంవత్సరము

1ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది.బీదలకు సువార్త ప్రకటించడానికియెహోవా నన్ను అభిషేకించారు.విరిగిన హృదయం గలవారిని బలపరచడానికిబందీలకు విడుదలనుఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,

2యెహోవా హితవత్సరాన్ని,మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికిదుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,

3సీయోనులో దుఃఖిస్తున్న వారికిబూడిదకు బదులుగాఅందమైన కిరీటాన్నిదుఃఖానికి బదులుఆనంద తైలాన్నిభారమైన ఆత్మకు బదులుస్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు.యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి,నీతి అనే సింధూర చెట్లనియెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.

4పురాతన శిథిలాలను వారు మరలా కడతారుగతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు;పాడైపోయిన పట్టణాలనుతరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు.

5అపరిచితులు మీ మందల్ని మేపుతారు;విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు.

6మీరు యెహోవా యాజకులని పిలువబడతారు,మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది.దేశాల సంపదను మీరు అనుభవిస్తారువారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.

7మీ అవమానానికి బదులుగారెట్టింపు ఘనత పొందుతారు.నిందకు బదులుగామీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు.మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు,శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.

8“ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము;దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము.నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తానువారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.

9వారి వారసులు దేశాల మధ్యవారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు.వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలనివారిని చూసినవారందరు గుర్తిస్తారు.”

10యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలానగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలాఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారుఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారుకాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను.నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.

11భూమి మొలకను మొలిపించినట్లు,విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా,అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవానీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]