Side by side with the Father's Heart Bible™ 1యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు?నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
2దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు,వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
3వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు;వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
4దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు;వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
5వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి;వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు;వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
6“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు”అని వారు తమలో తాము అనుకుంటారు.
7వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి;ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
8వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు;చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు.నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
9గుహలో సింహంలా వారు వేచి ఉంటారు.నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు;వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
10బాధితులు నలిగి కుప్పకూలిపోతారు;వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
11“దేవుడు ఎప్పటికీ గమనించరు;ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు”అని వారు తమలో తాము అనుకుంటారు.
12యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి.నిస్సహాయులను మరువకండి.
13దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు?“దేవుడు నన్ను లెక్క అడగరు”అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
14దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు;వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు.నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు;తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
15దుష్టుల చేతిని విరగ్గొట్టండి.కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండిఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
16యెహోవా నిరంతరం రాజై ఉన్నారు;దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
17యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు;మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
18తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు,అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.