Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 31 OTSA

Side by side with the Father's Heart Bible™

రాజైన లెమూయేలు సూక్తులు

1రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు.

2నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించునా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు!

3నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు,రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు.

4లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు,మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు,పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,

5ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు,అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.

6నశిస్తున్న వారికి సారా,హృదయ వేదనగల వారికి మద్యము.

7వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారుతమ కష్టాన్ని ఇక తలంచరు.

8తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం,నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి.

9మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి;దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.

ముగింపు: గుణవతియైన భార్య

10గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు?ఆమె ముత్యాల కంటే విలువైనది.

11ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడుఅతనికి లాభం తక్కువకాదు.

12ఆమె బ్రతుకు దినాలన్ని,అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.

13ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని,ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.

14ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే,వర్తకుల ఓడల లాంటిది.

15ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది;తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది;తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.

16ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది;తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.

17ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది,ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.

18ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది,రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.

19ఆమె పంటను చేత పట్టుకుంటుంది,తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.

20పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది,దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.

21మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు,ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.

22ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది,ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు.

23ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు,అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.

24ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది,వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.

25బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది;ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.

26ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది,దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.

27ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది,పని చేయకుండ ఆమె భోజనం చేయదు.

28ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు;ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:

29“చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు,కాని వారందరినీ నీవు మించినదానవు.”

30అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం;యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.

31చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది,ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]