Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 29 OTSA

Show OTSA only
Verse × ×
1 Whoever is often corrected yet refuses to listen will suddenly be broken beyond healing. ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు.
2 When the righteous flourish, the people rejoice, but when the wicked rule, the people groan. నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.
3 A man who loves wisdom brings joy to his father, but a companion of prostitutes squanders his wealth. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు, కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు.
4 By justice a king gives a land stability, but one who is greedy for bribes tears it down. న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.
5 A man who flatters his neighbor spreads a net for his feet. పొరుగువారిని పొగడేవారు వారి పాదాలకు వలలు వేస్తున్నారు.
6 An evil man is snared by his own sin, but the righteous sing and rejoice. కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు, కాని నీతిమంతుడు ఆనందంతో కేకలు వేస్తాడు సంతోషంగా ఉంటాడు.
7 The righteous care about justice for the poor, but the wicked have no such understanding. నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు.
8 Mockers set a city ablaze, but the wise calm the anger. ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు.
9 When a wise man goes to court with a fool, the fool rages and scoffs, and there is no peace. ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే, బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు.
10 The bloodthirsty hate the blameless and seek to kill the upright. రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.
11 A fool vents all his anger, but a wise man holds it back and keeps himself calm. మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
12 If a ruler listens to lies, all his officials become wicked. ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు.
13 The poor man and the oppressor have this in common: our Father gives sight to the eyes of both. పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా.
14 If a king judges the poor with fairness, his throne will be established forever. ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.
15 The rod and a word of correction give wisdom, but a child left to himself brings shame to his mother. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.
16 When the wicked flourish, wrongdoing flourishes, but the righteous will see the wicked's downfall. దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు.
17 Discipline your son, and he will give you peace; he will bring delight to your heart. మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.
18 Where there is no revelation, the people run wild, but blessed is the one who keeps the law. దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.
19 A servant cannot be corrected by words alone; though he understands, he will not obey. సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు.
20 Do you see a man who is hasty with his words? There is more hope for a fool than for him. త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.
21 Pamper a servant from childhood, and in the end he will become like an heir. చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు.
22 An angry man stirs up strife, and a hot-tempered man commits many sins. ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.
23 A man's pride brings him low, but a humble spirit gains honor. గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.
24 An accomplice of a thief is his own enemy; he hears the curse but says nothing. దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు.
25 Fear of man lays a snare, but whoever trusts in our Father is kept safe. మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.
26 Many seek a ruler's favor, but justice for a person comes from our Father. పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది.
27 An unjust man is detestable to the righteous, and an upright person is detestable to the wicked. నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]