Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 30 OTSA

Show OTSA only
Verse × ×
1 The words of Agur son of Jakeh—the oracle. The man declares: I am weary, O my Father; I am weary, O my Father, and worn out. యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను.
2 Surely I am too brutish to be a man; I do not have the understanding of a man. నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.
3 I have not learned wisdom, nor do I have knowledge of the Holy One. నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు.
4 Who has ascended to heaven and come down? Who has gathered the wind in the hollow of his hands? Who has wrapped the waters in a garment? Who has established all the ends of the earth? What is his name, and what is his son's name? Surely you know! ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!
5 Every word of our Father proves true; he is a shield to those who take refuge in him. “దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.
6 Do not add to his words, or he will rebuke you and prove you a liar. ఆయన మాటలకు కలపవద్దు, ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు.
7 Two things I ask of you; do not withhold them from me before I die: “యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను; నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి:
8 Keep falsehood and lies far from me; give me neither poverty nor riches; feed me only the bread that is my portion, అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి; దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి, కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.
9 for if I am full, I may deny you and say, "Who is God?" or if I am poor, I may steal and profane the name of my God. ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో పేదవాడినైతే దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.
10 Do not slander a servant to his master, or he will curse you and you will be found guilty. “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు.
11 There is a generation that curses its father and does not bless its mother. “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు;
12 There is a generation clean in its own eyes yet not washed of its filth. తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;
13 There is a generation—how proud its eyes, how scornful its glances! అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం;
14 There is a generation whose teeth are swords, whose fangs are knives, to devour the poor from the earth and the needy from among mankind. భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.
15 The leech has two daughters: "Give" and "Give." Three things are never satisfied; four never say, "Enough": “జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు:
16 The grave, the barren womb, the land never satisfied with water, and the fire that never says, "Enough." అవి ఏమనగా పాతాళం, పిల్లలు కనని గర్భం; నీరు చాలు అనని భూమి నీరు చాలు అనని అగ్ని.
17 The eye that mocks a father and scorns to obey a mother—the ravens of the valley will pluck it out, and the young vultures will eat it. “తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.
18 Three things are too wonderful for me; four I do not understand: “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు:
19 the way of an eagle in the sky, the way of a serpent on a rock, the way of a ship in the heart of the sea, and the way of a man with a young woman. అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.
20 This is the way of an adulteress: she eats and wipes her mouth and says, "I have done no wrong." “వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.
21 Under three things the earth trembles; under four it cannot bear up: “భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.
22 a servant when he becomes king, and a fool when he is filled with food; అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,
23 an unloved woman when she finally marries, and a servant girl when she displaces her mistress. పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ, యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి.
24 Four things on earth are small, yet they are exceedingly wise: “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి.
25 the ants are a people not strong, yet they store up their food in the summer; చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.
26 the rock badgers are a people not mighty, yet they make their homes in the cliffs; చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.
27 the locusts have no king, yet all of them advance in ranks; మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.
28 the lizard you can catch in your hands, yet it is found in kings' palaces. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.
29 Three things are stately in their stride; four are stately in their walk: “డంబంగా నడిచేవి మూడు కలవు, బడాయిగా నడిచేవి నాలుగు కలవు:
30 the lion, mightiest among beasts, which turns back before nothing; సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.
31 the strutting rooster, the male goat, and a king whose army is with him. కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.
32 If you have been foolish, exalting yourself, or if you have schemed evil, put your hand over your mouth. “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో.
33 For pressing milk produces curds, pressing the nose produces blood, and pressing anger produces strife. పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]