Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 28 OTSA

Show OTSA only
Verse × ×
1 The wicked flee when no one pursues, but the righteous are as bold as a lion. ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.
2 When a land rebels, it has many rulers, but with a man of understanding and knowledge, it stays stable. ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు, కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.
3 A poor man who oppresses the helpless is like a driving rain that leaves no food. పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.
4 Those who forsake the law praise the wicked, but those who keep the law strive against them. బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు, కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.
5 Evil people do not understand justice, but those who seek our Father understand it fully. కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.
6 Better is a poor man who walks with integrity than a rich man crooked in his ways. మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.
7 Whoever keeps the law is a son with understanding, but a companion of gluttons shames his father. వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు, కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు.
8 Whoever multiplies his wealth by interest and unjust gain gathers it for one who is generous to the poor. పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు.
9 If anyone refuses to listen to the law, even his prayer is detestable. ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే, వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.
10 Whoever leads the upright astray down an evil path will fall into his own pit, but the blameless will inherit good things. యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు, తమ ఉచ్చులో తామే పడతారు, కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు.
11 A rich man is wise in his own eyes, but a poor man with understanding sees right through him. ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు; వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.
12 When the righteous triumph, there is great glory, but when the wicked rise, people go into hiding. నీతిమంతులు విజయం సాధించినప్పుడు, గొప్ప ఉల్లాసం ఉంటుంది; కాని దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు దాక్కుంటారు.
13 Whoever conceals his sins will not prosper, but whoever confesses and turns from them will find mercy. తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
14 Blessed is the one who always remains reverent, but whoever hardens his heart will fall into calamity. దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు, కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.
15 Like a roaring lion or a charging bear is a wicked ruler over a helpless people. నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు.
16 A ruler who lacks understanding is a cruel oppressor, but whoever hates unjust gain will prolong his days. ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు, కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు.
17 A man weighed down by the guilt of bloodshed will be a fugitive until death; let no one support him. హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు సమాధిలో ఆశ్రయం వెదకుతారు; ఎవరు వారిని ఆపకూడదు.
18 Whoever walks in integrity will be kept safe, but whoever is crooked in his ways will suddenly fall. ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు, కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు.
19 Whoever works his land will have plenty of bread, but whoever chases empty pursuits will have plenty of poverty. తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.
20 A faithful man will abound with blessings, but whoever rushes to get rich will not go unpunished. నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.
21 Showing partiality is not good, yet for a piece of bread a man will do wrong. పక్షపాతం చూపడం మంచిది కాదు అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు.
22 A stingy man rushes after wealth and does not know that poverty will overtake him. పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.
23 Whoever rebukes a man will in the end find more favor than one who flatters with his tongue. నాలుకతో పొగిడే వారికన్నా, మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
24 Whoever robs his father or mother and says, "It is no sin," is a companion to one who destroys. తన తల్లిదండ్రులను దోచుకొని “ఇది ద్రోహం కాదు” అనేవాడు నాశనం చేసేవానికి భాగస్వామి.
25 A greedy man stirs up strife, but whoever trusts in our Father will be enriched. దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.
26 Whoever trusts in his own heart is a fool, but whoever walks in wisdom will be kept safe. తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
27 Whoever gives to the poor will lack nothing, but whoever closes his eyes to them will receive many curses. పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
28 When the wicked rise, people go into hiding, but when they perish, the righteous flourish. దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]